Tuesday 4 September 2012

బూరుగుపల్లిలో దసరా ఉత్సవాలు


బూరుగుపల్లిలో దసరా ఉత్సవాలు

బూరుగుపల్లి అనే గ్రామం పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం లోని గోదావరి ఒడ్డున గల ఒక పల్లెటూరు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. చెరకు,వరి ప్రధాన పంటలు. సన్నగా బంగారు రంగులో ఉండే బెల్లం చాలా ప్రసిద్ది. ఈ ఊరి పేరుమీదుగానే ఆబెల్లానికి బూరుగుపల్లి బెల్లం అని పేరు.ఈ ఊరిని ఆనుకొని ఉన్న వశిష్ట గోదావరి నది దాటితే అటువైపుగల ఊరు రాజోలు. బూరుగుపల్లి పాలకొల్లు పట్టణానికి రమారమి 15 కి.మీ. బూరుగుపల్లి జిల్లా ప్రధాన పట్టణమైన ఏలూరు నుండి 120 కి.మీ. పాలకొల్లు పట్టణం నుండి బస్సు సౌకర్యం కలదు.


స్దానికుల కధనం ప్రకారం బూరుగుపల్లి గ్రామ పెద్దలలో ఒకరైన కీర్తిశేషులు శ్రీ బోణం వెంకట కృష్ణారావు(అయ్యకాపు)గారు తన స్వప్నసందేశం ప్రకారం శ్రీ కనదుర్గమ్మ వారి ఆలయాన్ని నిర్మించి 13-03-2006 న అమ్మవారి విగ్రహప్రతిష్ఠ వారి కుమారులైన శ్రీ బోణం ఉమా చంద్రశేఖరరావు దంపతులచే చేయించినారు. అప్పటినుండి అమ్మవారి నిత్యపూజాది కైకర్యములు అర్చకస్వాములచే నిర్వహింపచేయుచూ శ్రీ చంద్రశేఖరరావు గారు అమ్మ సేవలో తరించుచున్నారు.
నాటి నుండీ ప్రతీ సం. దసరా ఉత్సవాలు బూరుగుపల్లి లో గల యువత ఆద్వర్యములో ఉత్సవకమిటీ వారు అత్యంత వైభవోపేతముగా నిర్వహించుచున్నారు.